జ్యోతిష్కుడి సంచలన వ్యాఖ్యలు

26 Jun, 2018 12:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరానికి చెందిన జ్యోతిష్కుడొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీల భవిష్యత్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. వారి భవిష్యత్‌ పరిస్థితులపై జోస్యం చెప్పారు. స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ.. మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబానికి చెందినవారు దేశ ప్రధాని అవుతారని ప్రకటన చేశారు. అభిషేక్‌ బచ్చన్‌- ఐశ్యర్యరాయ్‌ల కుమార్తె ఆరాధ్య బచ్చన్‌కు రాజకీయ భవిష్యత్తు పుష్కలంగా ఉందనీ.. ప్యూచర్‌లో ఆమె దేశ ప్రధానయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే ఆరాధ్య ప్రధాని కావాలంటే పేరును మాత్రం రోహిణిగా మార్చుకోవాలని సూచించారు.   

మరికొన్ని విషయాలు.. తమిళనాడులో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లో రజనీకాంత్‌ సీఎంగా ఎన్నికవుతారని వివరించారు. భారత్‌ పాక్‌ల భవిష్యత్తు గురించి కూడా ఙ్ఙానేశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఇరు దేశాల మధ్య యుద్దం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికవుతారన్నారు. అమెరికాలో కూడా డొనాల్డ్‌ ట్రంప్‌ మరోదఫా అధ్యక్షుడు అవుతారని ఆయన చెబుతున్నారు. దేశ కుభేరుడు ముఖేశ్‌ అంబానీ కుమారురు ఆకాశ్‌ అంబానీకి 2018 అంతగా కలిసిరాదని, అతని వివాహం 2019లో అవుతుందన్నారు. 

‘గతంలో నేను చెప్పినవన్నీ జరిగాయి. 2009లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని చెప్పాను. చిరంజీవి, రజనీకాంత్‌లు రాజకీయాల్లోకి వస్తారని చెప్పాను. నేనే చెప్పినట్టుగానే 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే రజనీకాంత్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు కూడా నేను చెప్పినవి జరిగి తీరతాయి’ అని ఙ్ఞానేశ్వర్‌ ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు.   

మరిన్ని వార్తలు