బిగ్‌బాస్‌.. సీక్రెట్‌ రూమ్‌లోకి రాహుల్‌

21 Sep, 2019 23:02 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంత వరకు జరిగింది ఒకెత్తు అయితే.. తొమ్మిదో వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ట్విస్ట్‌ అందరికీ పెద్ద షాక్‌. డబుల్‌ ఎలిమినేషన్‌ అని చెప్పి శనివారం రాహుల్‌ ఎలిమినేట్‌ అయినట్టు ప్రకటించి.. హౌస్‌మేట్స్‌ను షాక్‌కు గురి చేశాడు. అయితే ఇంతవరకు ఓకే అని అనుకుంటూ ఉంటే.. చూసే ప్రేక్షకుడికి మరో షాక్‌ ఇచ్చాడు. అంతా ఎమోషనల్‌ అవ్వడం చూసి ప్రేక్షకులు కూడా రాహుల్‌ ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోతున్న సమయంలో ఇదంతా ఫేక్‌ ఎలిమినేషన్‌ అంటూ మరో షాక్‌ ఇచ్చాడు. దీంతో రాహుల్‌ కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇక రాహుల్‌ను సీక్రెట్‌ రూమ్‌లోకి పంపించిన బిగ్‌బాస్‌ ఏ ఆట ఆడిస్తాడో చూడాలి.

అయితే రాహుల్‌ ఎలిమినేట్‌ కాలేదని, సీక్రెట్‌ రూమ్‌లోకి పంపించాడని శనివారం సాయంత్రం ప్రోమో రిలీజ్‌ చేసిన వెంటనే ట్రెండ్‌ అయింది. అయితే ఇందులో ఎంత నిజమున్నదో అప్పుడు తెలియక కొందరు అవన్నీ రూమర్స్‌గానే కొట్టిపారేశాడు. అయితే ప్రోమోలో అంతా తెలిసేట్టు కట్‌చేయడంతో అంత సస్పెన్స్‌గా అనిపించలేదు. ప్రోమోలో అలా చేశాడంటే.. కచ్చితంగా బిగ్‌బాస్‌ మైండ్‌లో ఏదో మర్మం ఉందని ఊహించిన నెటిజన్లు.. ఆయన ఆలోచనలను ఇట్టే పసిగట్టారు. రాహుల్‌ సీక్రెట్‌ రూమ్‌లో ఉన్నాడని ముందే చెప్పేశారు.

రాహుల్‌ది ఫేక్‌ ఎలిమినేషన్‌ అని తెలిస్తే.. పునర్నవే ఎక్కువగా సంతోషిస్తుందన్నది అందరికీ తెలిసిందే. రాహుల్‌ ఎలిమినేట్‌ అయ్యాడని నాగ్‌ చెప్పినప్పటి నుంచి పున్ను తెగ బాధపడుతూ కనిపించింది. రాహుల్‌ ఎలిమినేట్‌ కాడని తనకు గట్టి నమ్మకం అని నాగ్‌తో చెప్పుకొచ్చింది.. కానీ ఎలిమినేట్‌ అయ్యాడంటూ బాధపడింది. అయితే తన నమ్మకమే నిజమైందని పునర్నవికి తెలిస్తే.. ఎగిరి గంతేస్తుందేమో చూడాలి. ఇదే సమయంలో మిగతా ఇంటి సభ్యులకు ఇది ఫేక్‌ ఎలిమినేషన్‌ అని తెలిస్తే.. రాహుల్‌మళ్లీ హౌస్‌లోకి వస్తే.. ఎలా ఫీల్‌ అవుతారో చూడాలి. 

ఇదంతా పక్కన పెడితే వీకెండ్‌లో నాగ్‌ అందర్నీ ఓ రౌండ్‌వేసుకున్నాడు. శివజ్యోతిని ఏడ్పించిన బాబా, మహేష్‌ నామినేషన్‌ విషయంలో హిమజ, హిమజను నామినేట్‌ చేయడంపై వితికా, పున్ను కోసం రాహుల్‌ చేసిన సాహసం ఇలా ప్రతీ ఒక్క విషయాన్ని టచ్‌ చేశాడు. మహేష్‌ విషయంలో​ హిమజ చేసిన పనిపై ఆమెను ప్రశ్నించాడు. కావాలని చేశావా? నిర్లక్ష్యంతో చేశావా? మరిచిపోయి చేశావా? అంటూ హిమజను నిలదీశాడు. కావాలని చేయలేదు.. నిర్లక్ష్యం, మరిచిపోయి చేశానని చెప్పుకొచ్చింది. హిమజను నామినేట్‌ చేయడంపై వితికా, వరుణ్‌ను నాగ్‌ప్రశ్నించాడు. వరుణ్‌ పడ్డ కష్టాన్ని పేడలో పోశావంటూ సెటైర్‌ వేశాడు.

ఇక ఇరవై గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ను ఎలా తాగవంటూ రాహుల్‌ను ప్రశ్నించాడు. నీతో స్నేహం కట్‌, మాట్లాడను అంటూ చెప్పిన అమ్మాయి కోసం ఎందుకు తాగవంటూ అడిగాడు. ఇక పునర్నవి-రాహుల్‌-నాగ్‌ సంభాషణ హైలెట్‌గా మారింది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ నాగ్‌ హింట్‌ ఇచ్చాడు. ఆ విషయం నాకైతే తెలుస్తోందంటూ ఆట పట్టించాడు. ఫ్యామిలీ మెంబర్స్‌తో అందరూ మాట్లాడలేకపోయే సరికి.. వారి ఫోటోను కెప్టెన్‌ అయిన మహేష్‌ పట్టుకుంటాడు.. మీరు వారికి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండని ఓ చాన్స్‌ ఇచ్చాడు. దీంతో పున్ను, శివజ్యోతి కాస్త ఎమోషనల్‌ అయ్యారు. 

చదవండి

బిగ్‌షాక్‌.. రాహుల్‌ ఫేక్ ఎలిమినేషన్‌

హిమజ అవుట్‌.. అసలేం జరుగుతోందంటే?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు