బిగ్‌బాస్‌ హౌజ్‌లో కూతురిపై తండ్రి ఆగ్రహం

12 Sep, 2019 09:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమిళ్‌ బిగ్‌బాస్‌-3 అత్యంత ఎమోషనల్‌గా సాగుతోంది. తాజాగా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి కుటుంబసభ్యులను అనుమతించారు. దీంతో తమ ఆత్మీయులను చూసి కంటెస్టెంట్స్‌ భావోద్వేగానికి లోనయ్యారు. కొంతమంది ఆనందంతో కంటతడి పెట్టారు. అయితే, నటి, యాంకర్‌ లోస్లియాకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. చాలాకాలం తర్వాత కూతురిని చూసిన లోస్లియా తండ్రి భావోద్వేగానికి లోనవ్వడానికి బదులు.. కూతురిపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు.

బిగ్‌బాస్‌లో తోటి కంటెస్టెంట్‌ అయిన కేవిన్‌తో లోస్లియా సన్నిహితంగా ఉంటుంది. వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో లోస్లియా తీరు పట్ల ఆమె తండ్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నేను నిన్ను పెంచిన పద్ధతి ఇదేనా?’ అంటూ కోపం వ్యక్తం చేశారు. లోస్లియా ముందుగా తండ్రిని చూసి ఆనందానికి లోనయింది. అయితే, తండ్రి తనపై కోప్పడుతూ తిడుతుండటంతో ఆమె కన్నీటిపర్యంతమైంది. మరో కంటెస్టెంట్‌ చేరన్‌ లోస్లియా తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం తండ్రిని లోస్లియా హత్తుకొని ఏడ్చింది.బిగ్‌బాస్‌ హౌస్‌లో లోస్లియా తండ్రి వ్యవహరించిన తీరుపై సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లోస్లియాకు అండగా నిలుస్తున్న నెటిజన్లు టీవీ చానెల్‌లో కూతురిని దూషించడం పద్ధతి కాదని అంటున్నారు. ప్రేక్షకుల హృదయాలను గెలుస్తూ ఇన్నాళ్లు బిగ్‌బాస్‌ పోటీలో ఉండగలిగినందుకు లోస్లియాను చూసి ఆమె తండ్రి గర్వపడాలి కానీ, ఇలా దూషించడమేమిటని నిలదీస్తున్నారు. లోస్లియా-కేవిన్‌ మధ్య ప్రేమాయాణం సాగుతున్నట్టు హైలైట్‌ చేసిన తమిళ్‌ బిగ్‌బాస్‌ హోస్ట్‌ కమల్‌ హాసన్‌, కంటెస్టెంట్‌ చేరన్‌ తీరును కూడా వారు తప్పుబడుతున్నారు.

కన్నీటిపర్యంతమైన లోస్లియా

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!

పునర్నవి డేరింగ్‌.. బిగ్‌బాస్‌పైనే తిరుగుబాటు!

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా

బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి యాంకర్‌ రవి షాక్‌!

బిగ్‌బాస్‌.. భయపడే శ్రీముఖి అలా చేసిందట!

బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన పునర్నవి

అలీ రెజా ఇంట్లో విషాదం.. భావోద్వేగ పోస్ట్‌

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అలీ రీఎంట్రీ?

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?

అలీ అవుట్‌.. షాక్‌లో హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌!

బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!