నేను ములాయం సింగ్‌

27 Jun, 2020 04:46 IST|Sakshi

సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ జీవితం ఆధారంగా ‘మై ములాయం సింగ్‌ యాదవ్‌’ (నేను ములాయం సింగ్‌ యాదవ్‌) అనే సినిమా తెరకెక్కుతోంది. సువేందు రాజ్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ములాయం పాత్రలో అమిత్‌ సేథి నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్‌ని విడుదల చేశారు చిత్రబృందం. ఈ సందర్భంగా సువేందు రాజ్‌ ఘోష్‌ మాట్లాడుతూ– ‘‘ములాయం సింగ్‌ యాదవ్‌ అనే పేరే ఎంతో శక్తివంతమైంది. ఒక రైతు కొడుకు ముఖ్యమంత్రిగా, అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగారు. భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల కోసం ఆయన ఎంతో చేశారు. అలాంటి వ్యక్తి జీవితం గురించి ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నా’’ అన్నారు.  

మరిన్ని వార్తలు