దుమ్మురేపుతున్న ‘డుమ్‌ డుమ్‌’ పాట

26 Dec, 2019 20:44 IST|Sakshi

రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్‌’. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్‌ తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ సాంగ్ 'దుమ్ము ధూళి' విడుదలైంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకువెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటకి అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందిచగా, ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు.

తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. 'డుమ్ డుమ్' అంటూ సాగే ఈ పాట రజనీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. పెళ్లికి ముందు, తర్వాత భార్యభర్తలు ఎలా ఉండాలి అనే అంశాన్ని పాట రూపంలో చక్కగా తెలియజేశారు. పెళ్లి నేపథ్యంలో వచ్చే ఈ ఎనర్జిటిక్‌ సాంగ్‌కు కృష్ణకాంత్‌ లిరిక్స్‌ అందించగా, మకాష్‌ అజీజ్‌ ఆలపించాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా