వెండితెరపై వీరనారి...!

4 May, 2017 23:21 IST|Sakshi
వెండితెరపై వీరనారి...!

వీరనారి రాణి లక్ష్మీభాయ్‌ జీవిత చరిత్రను ‘మణికర్ణిక’గా వెండితెరపై ఆవిష్కరించనున్నారు క్రిష్‌. బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ లక్ష్మీభాయ్‌ పాత్రలో నటించనున్నారు. జీ స్టూడియో సమర్పణలో  కైరోస్‌ కంటెంట్‌ ప్రొడక్షన్స్‌పై జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌) దర్శకత్వంలో కమల్‌ జైన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్‌–ఇషాన్‌–లాయ్‌ త్రయం సంగీతం సమకూర్చుతున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు.

గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ‘మణికర్ణిక’ టైటిల్‌ లోగో విడుదల, రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరవై అడుగుల పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.