సీనియర్‌ నటికి కరోనా పాజిటివ్‌!

6 Jul, 2020 19:25 IST|Sakshi

బెంగుళూరు: చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. శనివారం ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పి రావడంతో అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దానికి సంబంధించి రిపోర్ట్ ఇవాళ(సోమవారం)  రాగా.. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది. (‘నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఈటల’)

ప్రస్తుతం సుమలత హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో..త్వరలోనే కరోనా నుంచి బయటపడతానని ఆమె చెప్పారు. ఇటీవల తాను కలిసిన వారందరి వివరాలను అధికారులు వెల్లడంచానని తెలిపారు. వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సుమలత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. జేడీఎస్ అభ్యర్థి, దేవెగౌడ మనవడు నిఖిల్‌పై గెలిచి, పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. తన నియోజక వర్గంలోని ప్రజలకు పలుమార్లు సుమలత కరోనా పై అవగాహన కల్పించారు. తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. (కరోనాకు మందు కనిపెట్టిన స్టార్‌ డైరెక్టర్‌!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు