మహేష్తో అనుకున్నదే వెంకటేష్తో

6 Jan, 2017 15:08 IST|Sakshi
మహేష్తో అనుకున్నదే వెంకటేష్తో

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగంతి తెలిసిందే. స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన పూరి, ప్రస్తుతం రోగ్ సినిమాను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి హీరోలతో గతంలోనే సినిమాలను ప్రకటించిన పూరి.. ఆ హీరోలు అందుబాటులో లేకపోవటంతో వెంకీతో సినిమా ప్లాన్ చేశాడు.

మహేష్తో ప్రకటించిన జనగణమన సినిమానే వెంకటేష్ హీరోగా తెరకెక్కించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్ తొలిసారిగా నిర్మాతగా మారుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు వెంకటేష్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.