శివ, హ్యాపీడేస్‌ స్టైల్‌లో ఉంటుంది

8 Mar, 2018 04:16 IST|Sakshi
అనిల్‌ సుంకర, సంయుక్త, నిఖిల్, సిమ్రాన్, శరణ్‌

‘‘శివ, హ్యాపీడేస్‌’ స్టైల్‌లో సాగే పూర్తి స్థాయి కాలేజ్‌ చిత్రమిది. ఆ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. ‘కిరాక్‌ పార్టీ’ తప్పకుండా ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు అనిల్‌ సుంకర. నిఖిల్, సిమ్రాన్‌ పరింజా, సంయుక్తా హెగ్డే హీరో హీరోయిన్లుగా శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కిరాక్‌ పార్టీ’.  ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా మార్చి 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో చిత్రబృందం సినిమా విశేషాలు పంచుకున్నారు. 

‘‘16న సినిమా విడుదల అవుతుంది. ఇంటర్‌ ఎగ్జామ్స్‌ 15తో అయిపోయిన వెంటనే మా సినిమా రావటం ఆనందంగా ఉంది. ప్రొమోషన్స్‌లో భాగంగా ఓ కాంటెస్ట్‌ నిర్వహిస్తున్నాం. అందులో విజేతలకు సినిమాలో వాడిన కారును బహుమతిగా అందజేస్తాం. గురువారం నుంచి రెండు రాష్ట్రాల్లో టూర్‌ చేయనున్నాం. 10న విజయవాడలో ఆడియో, 13న ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తాం. ‘శివ’ సినిమా చూసినప్పుడు అలాంటి సినిమా తీయగలనా లేదా అనుకునేవాణ్ణి. ఆ ఆలోచనతోనే ‘కిరిక్‌ పార్టీ’ సినిమాను రీమేక్‌ చేశాం.

శరణ్‌ సినిమాను బాగా తీశాడు. సుధీర్‌ వర్మ, చందూ మొండేటి సహకారం అందించారు’’ అన్నారు అనిల్‌ సుంకర. ‘‘నా సినిమాల్లో నా హార్ట్‌కు దగ్గరైన సినిమాల్లో ఇదొకటి. సినిమా ఇంకా బాగా రీచ్‌ కావడానికి టూర్‌ ప్లాన్‌ చేశాం. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు హీరో నిఖిల్‌. ‘‘శివ, హ్యాపీడేస్‌’ ఇన్‌స్పిరేషన్‌తో కన్నడ ‘కిరిక్‌ పార్టీ‘ని తెలుగు ఆడియన్స్‌కు నచ్చేలా తీశాం. స్టూడెంట్స్‌ అందరూ వాళ్లని స్క్రీన్‌పై చూసుకున్నట్టు ఉంటుంది’’ అన్నారు దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి. ఈ కార్యక్రమంలో సిమ్రాన్, సంయుక్తా, ఆర్య, రాకేందు మౌళి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు