కారు ప్రమాదంపై నాని క్లారిటీ ఇస్తాడా..!

31 Jan, 2018 15:40 IST|Sakshi
హీరో నాని

ఇటీవల యంగ్ హీరో నాని కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ముందుగా ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మాత్రమే గాయపడ్డట్టుగా వార్తలు వినిపించినా.. తరువాత తనకు కూడా స్వల్ప గాయాలైనట్టుగా నాని స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై స్పందించేందుకు నాని చాలా సమయం తీసుకోవటంతో ఈ లోగా మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చేందుకు నాని రెడీ అవుతున్నాడట.

నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘అ!’. ఫిబ్రవరి 16న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను ఈ రోజు(బుధవారం) హైదరాబాద్‌లో గ్రాండ్‌ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా వేడుకలో కారు ప్రమాదంపై నాని స్పందించనున్నాడట. ఇదే వేడుకలో అ! థియేట్రికల్‌ ట్రైలర్‌ను కూడా లాంచ్‌ చేయనున్నారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌, నిత్యా మీనన్‌, రెజినా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్‌, ప్రియదర్శిలు కీలక పాత్రల్లో నటిస్తుండగా నాని, రవితేజలు చేప, చెట్టు పాత్రలకు వాయిస్‌ అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనాపై పోరుకు బాలయ్య విరాళం

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..

గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం

‘నువ్వు వచ్చాకే తెలిసింది.. ప్రేమంటో ఏంటో’

సినిమా

కరోనాపై పోరుకు బాలయ్య విరాళం

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..

గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం

‘నువ్వు వచ్చాకే తెలిసింది.. ప్రేమంటో ఏంటో’

లాక్‌డౌన్‌: ఇంట్లో మలైకా ఏం చేస్తుందంటే!