‘ముద్ర’ కాదు.. ‘అర్జున్‌ సురవరం’

5 Feb, 2019 03:36 IST|Sakshi
నిఖిల్

నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టీఎన్‌ సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. బి. మధు అర్జున్‌ సమర్పణలో ఔరా సినిమాస్‌ పీవీటి, మూవీ డైనమిక్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్‌ నిర్మించారు. ఈ చిత్రానికి ముందుగా ‘ముద్ర’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇప్పుడు ఆ టైటిల్‌ను ‘అర్జున్‌ సురవరం’గా మార్చిన యూనిట్‌ టైటిల్‌ లోగో విడుదల చేశారు. ‘‘ఈ సినిమాలో నిఖిల్‌ జర్నలిస్ట్‌ పాత్రలో నటించారు. యూరప్‌లో చివరి పాట చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మార్చి 29న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సూర్య, సంగీతం: శ్యామ్‌ సీఎస్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు