అదే రోజు.. అదే తప్పు!

16 Oct, 2017 10:25 IST|Sakshi

... జరిగింది అంటున్నారు నివేదా థామస్‌. ఇంతకీ ఏ రోజు గురించి ఆమె చెబుతున్నారు? స్ట్రెయిట్‌గా పాయింట్‌లోకి వచ్చేద్దాం. సెలబ్రిటీల బర్త్‌డే ఎప్పుడో తెలుసుకోవాలంటే నెటిజెన్లు ఎవరైనా గూగుల్‌ తల్లిని హెల్ప్‌ అడుగుతారు. అలాగే, ఈ మధ్య నివేదా ఫ్యాన్స్‌ కొందరు గూగుల్‌ సెర్చ్‌లో ఆమె బర్త్‌డే ‘అక్టోబర్‌ 15’ అని తెలుసుకున్నారు. అంతే.. ఈ  బ్యూటీకీ సోషల్‌ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్‌ చెప్పడం స్టార్ట్‌ చేశారు. ‘థ్యాంక్యూ’ అని రిప్లై ఇచ్చి, అసలు విషయం బయటపెట్టారు నివేదా.

‘‘మీ విలువైన సమయాన్ని వెచ్చించి నాకు బర్త్‌డే విషెస్‌ చెప్పినందుకు ధన్యవాదాలు. కానీ, ఈ రోజు నా పుట్టినరోజు కాదు’’ అని ట్వీట్‌ చేశారు. అంతా ఓకే.. కానీ, అసలు పుట్టినరోజు ఎప్పుడో మాత్రం చెప్పలేదు. చెప్పకపోతే అభిమానులు తెలుసుకోరా ఏంటి? ‘నవంబర్‌ 2న నివేదా బర్త్‌డే’ అని చెప్పేశారు. ఇంతకీ వీళ్లకు ఆ డేట్‌ ఎలా తెలిసిందీ అంటే... గతేడాది ఆమె ఇదే విషయమై రెస్పాండ్‌ అయిన ట్వీట్‌ను పోస్ట్‌ చేశారు. విచిత్రం ఏంటంటే... లాస్ట్‌ ఇయర్‌ కూడా అక్టోబర్‌ 15 నివేదా బర్త్‌డే అనుకుని, చాలామంది విషెస్‌ చెప్పారు.

ఆ ట్వీట్‌ని ఇప్పుడు అభిమానులు బయటికి తీశారు. అందులో నివేదా బర్త్‌డే నవంబర్‌ 2 అని ఉంది. ఏదేమైనా లాస్ట్‌ ఇయర్‌లానే ఈ ఇయర్‌ కూడా జరిగింది. మరి ఇప్పుడు బహుమతులు పంపిన అభిమానులు మళ్లీ నవంబర్‌ 2న కూడా పంపుతారేమో. మరోవైపు నెక్ట్స్‌ ఇయర్‌ అయినా ఫ్యాన్స్‌ నివేదాకి డైరెక్ట్‌గా నవంబర్‌ 2నే బర్త్‌డే విషెస్‌ చెబుతారో లేక సేమ్‌ మిస్టేక్‌ని రిపీట్‌ చేస్తారో? వెయిట్‌ అండ్‌ సీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా