ఆస్కార్‌లో మరో కొత్త అవార్డ్‌.. విమర్శలు

9 Aug, 2018 11:51 IST|Sakshi

ఆస్కార్‌.. సినిమా రంగంలో ప్రతి కేటగిరీకి చెందిన వ్యక్తుల కలల అవార్డు. అలాంటి ప్రతిష్టాత్మక అవార్డ్స్‌ల విభాగంలో కొత్త అవార్డు ఒకటి వచ్చి చేరనుంది. దీనిపై ద అకాడమీ అధికారిక ట్విటర్‌లో కొంత సమాచారాన్ని షేర్‌ చేశారు. ‘బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌’అనే కొత్త కేటగిరీని అస్కార్‌ అవార్డుల్లో చేర్చి మరో అవార్డును అందించనున్నారు. ది అకాడమీ వారి ట్విట్‌ ప్రకారం.. 2020 నుంచి బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌  అవార్డు అందుబాటులోకి రానుంది. ఆ ఏడాది ఫిబ్రవరి 9న దీనిపై మరో ప్రకటన వెలువడనుంది. మూడు గంటలపాటు ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని ప్రసారం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 

విమర్శల వెల్లువ
బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ కేటగిరిని ఆస్కార్‌ అవార్డుల్లో చేర్చడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్ అవార్డు అనేది.. ఆస్కార్‌ అవార్డులను అవమానించడమే. ఇవి ఎంటీవీ అవార్డులు అనుకున్నారా అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. బెస్ట్‌ హర్రర్‌ ఫిల్మ్‌ అనే కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు అని ప్రకటన రావడంతో నా నిద్ర ఎగిరిపోయిందంటూ మరొకరు ట్విట్‌ చేశారు. నా చిన్నప్పుడు విడుదలైన మూవీకి బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ అవార్డు ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేస్తానని యుగెన్‌ లీ యాంగ్‌ అనే నెటిజన్‌ పోస్ట్‌ చేశాడు.

>
మరిన్ని వార్తలు