ఆ ప్రశ్న ప్రభాస్‌నే అడగండి!

24 Jan, 2018 00:18 IST|Sakshi

‘‘మ్యాచ్‌లు కచ్చితంగా ఆడతాను. కానీ ఎప్పుడన్నది చెప్పలేను’’ అంటున్నారు శ్రద్ధా కపూర్‌. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో శ్రద్ధా కపూర్‌ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం లేదన్న ఊహాగానాలు ఈ మధ్య ఊపందుకున్నాయి. ‘‘ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్నాను. నేను నటిస్తోన్న హిందీ సినిమా ‘స్త్రీ’ షూటింగ్‌ చందేరిలో జరుగుతోంది. నా కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ చేస్తోన్న హారర్‌ సినిమా ఇది. సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ తప్పకుండా సెట్స్‌పైకి వెళుతుంది. కానీ ఎప్పుడన్నది ఎగ్జాట్‌గా చెప్పలేను’’ అని శ్రద్ధా కపూర్‌ చెప్పారని బీటౌన్‌ సమాచారం. ‘సాహో’ చిత్రంలో తన కో–స్టార్‌ ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ –‘‘ప్రభాస్‌ సూపర్‌ యాక్టర్‌ మాత్రమే కాదు.. మంచి హ్యూమన్‌ బీయింగ్‌ కూడా’’ అన్నారు. మరి.. ప్రభాస్‌ పెళ్లి గురించి మీకేమైనా తెలుసా? అని బీ టౌన్‌ మీడియావారు అడగ్గా.. ‘‘నాకు తెలీదు. ఈ ప్రశ్న ప్రభాస్‌నే అడగండి’’ అని నవ్వుతూ అన్నారట.

ప్రభాస్‌ సరసన అర్షిఖాన్‌?
 అర్షిఖాన్‌... హిందీ బిగ్‌బాస్‌ లెవెన్త్‌ ఎడిషన్‌ షోలో పాల్గొనడం ద్వారా పాపులర్‌ అయ్యారు. అంతేకాదు ఓ ప్రముఖ చానెల్‌లో ఓ ప్రోగ్రామ్‌కి ఆమె గెస్ట్‌గా వర్క్‌ చేస్తున్నారు. ఇప్పుడు అర్షిఖాన్‌ గురించి ఇంతగా ఎందుకు అంటే.. ప్రభాస్‌ సినిమాలో చాన్స్‌ కొట్టేశానని ఆమె సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ‘‘ప్రభాస్‌ నటించనున్న సినిమాకు సైన్‌ చేశాను. చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు అర్షిఖాన్‌. అది ఏ సినిమా అని మాత్రం ఆమె చెప్పలేదు. ప్రభాస్‌ బాలీవుడ్‌లో చేయబోయే నెక్ట్స్‌ సినిమాకా? లేక ఆల్రెడీ చేస్తున్న ‘సాహో’లో కీలక పాత్రకా? అనేది తెలియాల్సి ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్‌ మేటర్‌ ఏంటంటే.. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో గతేడాది గూగుల్‌ సెర్చ్‌లో సన్నీ లియోన్‌ తర్వాత మోస్ట్‌ సెర్చింగ్‌ పర్సన్‌ అర్షిఖాన్‌నే కావడం విశేషం. 

మరిన్ని వార్తలు