అంత రహస్యంగా ఎందుకో..?

31 Aug, 2018 09:36 IST|Sakshi

‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు శ్రియ శరన్‌. అనాటి నుంచి నేటి వరకూ ఆమె తన సినీ ప్రయాణాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది మార్చ్‌లో శ్రియ, తన రష్యన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కోశ్చివ్‌ను ఉదయపూర్‌లో అతి రహస్యంగా వివాహం చేసుకోన్నారు. కానీ ఆమె ఎంత రహస్యంగా పెళ్లి చేసుకోవాలనుకున్నా..  వారి వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మాత్రం నెట్టింట్లో హల్‌చల్‌ చేసాయి. అయితే వీటి గురించి కానీ, తన వివాహం గురించి కానీ శ్రియ ఇంతవరకూ అధికారికంగా ప్రకటించ లేదు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

శ్రియ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి వచ్చారు. అయితే అందులో అంత ఆసక్తి ఏముంది అంటే.. దైవ దర్శనానికి వచ్చిన శ్రియ తనను ఎవరూ గుర్తు పట్టకూడదనే ఉద్దేశంతో మొహాన్ని పూర్తిగా దాచుకుని కనిపించారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చే ముందు కానీ, బయటకు వచ్చిన తర్వాత శ్రియ తన మొహాన్ని పూర్తిగా కవర్‌ చేసుకునే కనిపించారు. శ్రియని ఇలా గమనించిన అభిమానులు దైవ దర‍్శనానికి వచ్చినప్పుడు అంత రహస్యంగా ఉండటం ఎందుకంటా..? అని ప్రశ్నిస్తున్నారు.

దీనిపై విలేకరులు, అభిమానులు చుట్టూ చేరి ఇబ్బంది పెడతారని అలా చేసి ఉండొచ్చు కదా..! అంటూ కొందరు శ్రియకు మద్దతు తెలుపుతుండగా మరికొందరు మాత్రం అదేం కాదు అసలు సమస్య వేరే ఉందంటున్నారు. అది ఏంటంటే శ్రియ వచ్చిందని తెలిస్తే ఆమె చుట్టూ చేరే అభిమానులు కన్నా వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడమే ఇప్పుడు ఆమెకు అన్నింటికన్నా ఇబ్బందికర అంశం అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా శ్రియను మొదటి అడిగే ప్రశ్న ఆమె వివాహం గురించే.

అయితే దీని గురించి ఆమె సన్నిహితులు.. ప్రస్తుతం శ్రియ తన వివాహం గురించి కానీ మరే ఇతర వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదని తెలిపారు. అందుకే ఆమె తిరుమల రావడం, శ్రీవారిని దర్శించడం అన్ని కూడా రహస్యంగానే జరిగాయంటున్నారు. ప్రస్తుతం శ్రియ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘వీరభోగ వసంత రాయలు’లో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు