యూట్యూబ్‌లో చిన్మయి సంచలనం

24 Oct, 2018 09:57 IST|Sakshi
చిన్మయి

తమిళనాడు, పెరంబూరు: గాయని చిన్మయి యూట్యూబ్‌లో ట్రెండీగా మారారు. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు చాలాకాలంగా వస్తున్నా, గాయనీ చిన్మయి గీత రచయిత వైరముత్తుపై చేసిన వేధింపుల ఆరోపణలు తరువాత మీటూ బహుళ ప్రాచుర్యం పొందిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె ఆరోపణలు చిత్ర పరిశ్రమలో పెద్ద కలకలానికే దారి తీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో దినతంది అనే ప్రముఖ తమిళ దిన పత్రిక గాయని చిన్మయిని ఇంటర్వ్యూ చేసింది. ఆ భేటీని యూట్యూబ్‌లో పొందుపరచారు.

దీన్ని 24 గంటల్లో 15 లక్షల మంది యూట్యూబ్‌ ప్రేక్షకులు తిలకించారు. ఇలా ఒక సెలబ్రిటీ భేటీని అంత మంది వీక్షించడం రికార్డుగా నమోదైంది.ఆమె భేటీ అలా 24 గంటల పాటు మూడవ స్థానంలో నిలిచింది. నటుడు కమలహాసన్‌ భేటీని 24 గంటల్లో 10 లక్షలకు పైగా ప్రజలు వీక్షించారు. అదే విధంగా ప్రధాని నరేంద్రమోది, సీమాన్, నటుడు శివకార్తికేయన్, దీపతో ఆ పత్రిక జరిపిన ప్రశ్నోత్తరాల కార్యక్రమాలను పెద్దసంఖ్యలో తిలకించారనే కథనాన్ని ఒక సాయంకాల పత్రిక పేర్కొంది.

మరిన్ని వార్తలు