పొన్నియిన్‌.. శోభితా ఇన్‌

16 Feb, 2020 03:18 IST|Sakshi
శోభితా ధూళిపాళ్ల

చోళసామ్రాజ్యంలో రాణిగా స్థానం సంపాదించారు హీరోయిన్‌ శోభితా ధూళిపాళ్ల. ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడికల్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. విక్రమ్, కార్తి, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్‌ ఈ సినిమాలో ప్రధానతారాగణం. వీరితో పాటు తాజాగా శోభితా ధూళిపాళ్ల కూడా ఈ చిత్రంలో చోటు సంపాదించారు. ‘‘మణిరత్నంగారి దర్శకత్వంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు శోభిత. కూచిపూడి, భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యత, నైపుణ్యం ఉన్న ఓ రాణి పాత్రలో శోభిత నటించబోతున్నారని టాక్‌. నిజజీవితంలోనూ శోభితా మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌ అనే సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు