కొలంబో పేలుళ్లు.. స్పందించిన సినీతారలు

21 Apr, 2019 14:29 IST|Sakshi

శ్రీలంకలోని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఆదివారం ఈస్టర్‌ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఇప్పటికీ వరకు అందించిన సమాచారం మేరకు ఈ దాడిలో 165 మంది మృతిచెందగా, 280మందికి పైగా గాయాలయ్యాయి. అయితే తమిళ, తెలుగు తారలు సోషల్‌ మీడియా వేదికగా ఈ ఘటనను ఖండించారు. 

తమిళ హీరో శరత్‌ కుమార్ ట్వీట్‌ చేస్తూ.. ‘కొలంబోలో జరిగిన ఉగ్రదాడి ఖండించదగినది. ఆ దాడిలో చనిపోయిన అమాయకులను చూస్తే.. హృదయం చలించిపోతోంది’‌ అని పేర్కొన్నారు. విశాల్‌ కూడా ఈ ఘటనను ఖండించారు. సాయి ధరమ్‌ తేజ్‌ ఈ ఘటనపై స్పందిస్తూ.. శ్రీలంక బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాధికా శరత్‌కుమార్‌ తృటిలో ప్రమాదం తప్పించుకున్నానని తెలిపారు. ప్రధాని మోదీ సహా ప్రముఖ రాజకీయ నాయకులు ఈ ఘటనను ఖండించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా