ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో చెప్పేసిన విక్కీ

2 Apr, 2020 18:27 IST|Sakshi

బాలీవుడ్ హీరో విక్కీ కౌశ‌ల్‌, అందాల భామ క‌త్రినా కైఫ్ మ‌ధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ ఎప్ప‌టి నుంచో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఊహాగానాల‌పై స్పందించిన విక్కీ త‌న ఫ‌స్ట్ ల‌వ్ క‌త్రినా కాద‌ని బాంబు పేల్చాడు. వివ‌రాల్లోకి వెళితే.. ఈ హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించాడు. ఈ సంద‌ర్భంగా వాళ్లు అడిగే అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఎలాంటి విసుగు ప్ర‌ద‌ర్శించ‌కుడా తీరిక‌గా స‌మాధాన‌మిచ్చాడు. దొరికిందే చాన్సు అనుకున్న అభిమానులు హీరో నుంచి వీలైన‌న్ని సీక్రెట్స్ రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. అందులో భాగంగా బాలీవుడ్‌లో మీరు తొలుత ప్రేమించిన వ్య‌క్తి ఎవ‌రు అని అభిమాని ప్ర‌శ్నించ‌గా విక్కీ.. ఎలాంటి త‌త్త‌ర‌పాటు లేకుండా ఫొటోతో స‌హా స‌మాధాన‌మిచ్చాడు.

అల‌నాటి అందాల న‌టి మాధురీ దీక్షిత్ అంటే ఇష్ట‌మంటూ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు. ఇక మీరు ఈ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ఎలా ఉప‌యోగించుకుంటున్నార‌న్న ప్ర‌శ్న‌కు కుటుంబంతో గ‌డుపుతూ, సినిమాలు చూస్తూ, అప్పుడ‌ప్పుడు అమ్మ‌తో యోగా, ఫ్రెండ్స్‌తో వీడియో కాల్ ద్వారా కాలాన్ని నెట్టుకొస్తున్నాన‌న్నాడు. ఈ "ఉరి: ద స‌ర్జిక‌ల్ స్ట్రైక్" హీరో క‌రోనాపై పోరుకు రూ.1 కోటి విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కాగా ఆయ‌న తాజాగా స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు "స‌ర్దార్ ఉద్ధ‌మ్ సింగ్ "బ‌యోపిక్‌లో న‌టించగా ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. (నటుడు కావాలని నిర్ణయం తీసుకున్నాక విక్కీ చేసిన మొదటి పని)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా