అభిమన్యుడు సినిమా దూసుకెళ్తోంది

4 Jun, 2018 18:31 IST|Sakshi

విశాల్‌ హీరోగా నటించిన అభిమన్యుడు సినిమాతో థియేటర్లు హౌస్‌ఫుల్‌తో కలకలలాడుతున్నాయి. ఈ వారం విడుదలైన ఆఫీసర్‌, రాజుగాడు పూర్తిగా తేలిపోవడంతో అభిమన్యుడు కలెక్షన్స్‌లో దుమ్ముదులుపుతోంది. సైబర్‌ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. 

విశాల్‌ గత సినిమా డిటెక్టివ్‌ విభిన్న కథతో తెరకెక్కడం, అది కూడా విజయవంతం కావడంతో అభిమన్యుడు సినిమాపై టాలీవుడ్‌ కూడా ఆసక్తితో ఎదురుచూసింది. మొదటి వారాంతానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 7కోట్లు వసూళ్లను సాధించింది. ఓ డబ్బింగ్‌ సినిమా ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌ సాధించడం చూసి చాలా కాలమైంది. తమిళ నాట కూడా ఈ సినిమా రికార్డ్‌ కలెక్షన్లను సాధిస్తోంది. ఈ సినిమాలో విశాల్‌కు జోడిగా సమంత నటించగా, ప్రతినాయకుడిగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నటించారు. ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిచగా,  పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు