మారణకాండకు వందేళ్లు : రూ.100 నాణెం విడుదల 

13 Apr, 2019 17:16 IST|Sakshi

అమృతసర్‌ : జలియన్‌ వాలాబాగ్‌ మారణహోమం జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణేన్ని విడుదల చేసింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకున్నబిట్రీష్‌ దుశ్చర్యకు వంద సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ నాణేలను శనివారం విడుదల చేశారు. పంజాబ్‌లోని అమృతసర్‌లోని జలియాన్‌ వాలాబాగ్‌  స్మారకం వద్ద వెంకయ్యనాయుడు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం స్మృతి చిహ్నంగా కొత్త వంద రూపాయల నాణేన్ని, స్టాంప్‌ను రిలీజ్‌ చేశారు. 

కాగా  భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది.  పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జనలర్‌ డయ్యర్‌  ఆధ్వర్యంలో జరిగిన జలియన్ వాలాబాగ్‌‌ కాల్పుల్లో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.  కాగా వందేళ్ళ తరువాత జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ బ్రిటిష్‌ ఇండియన్‌ చరిత్రలోనే సిగ్గుచేటుగా బ్రిటిష్‌ ప్రధాని థెరిసా మే వ్యాఖ్యానించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు