Sakshi News home page

జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి

Published Wed, Sep 6 2023 8:32 PM

Venkaiah Naidu Backs Simultaneous Polls India Name Change To Bharat - Sakshi

హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించారు భారత్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అలా కాకుండా తరచుగా ఎన్నికలు జరుగుతూ ఉంటే దానివలన దేశప్రగతికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ సందర్బంగా ఇండియా పేరును భారత్ అని మార్చడంలో కూడా తప్పులేదని అన్నారు.        

ప్రయోజనకరమే.. 
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తరచుగా ఎన్నికలు జరగడం వలన ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతుందని, ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తే ఖజానాపై ఖర్చు భారం తగ్గుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్, లా కమిషన్, పార్లమెంట్ ష్టాండింగ్ కమిటీ అభిప్రాయాలు సిఫారసుల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నికల సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం మంచిదని అన్నారు. 1971 వరకు దేశంలో ఒకే ఎన్నికలు ఉండేవని తర్వాతి కాలంలో వివిధ కారణాల వలన ఈ ప్రక్రియకు తెరపడిందన్నారు.    

ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి.. 
ప్రజాస్వామ్యంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. కానీ చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించుకుని ముందుకు సాగాలని అన్నారు. చట్టసభ్యులు పార్టీలను ఫిరాయించడంపై ఆయన మాట్లాడుతూ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలని అన్నారు. తరచూ ఎన్నికలు జరగడం వలన ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నిరనలు తీసుకోలేవని తెలిపారు. ఇక ఇండియా పేరును భారత్‌గా మార్చడంపై అందులో తప్పేమీ లేదని ఆ పేరు ఎప్పటినుంచో వాడకంలోనే ఉందని అన్నారు. 

ఇది కూడా చదవండి: మీరు వద్దనుకుంటే  పాకిస్తాన్‌కు ఇండియా పేరు పెట్టుకుంటాం 

Advertisement

What’s your opinion

Advertisement