పొరపాటుగా భారత్ లోకి వచ్చిన పాక్ చిన్నారి

5 Mar, 2016 21:32 IST|Sakshi
పొరపాటుగా భారత్ లోకి వచ్చిన పాక్ చిన్నారి

ఛండీగఢ్ః ఐదేళ్ల చిన్నారి పాకిస్తాన్ సరిహద్దులు దాటి ఇండియాలో ప్రవేశించింది. చెవిటి,మూగ సమస్యలతో బాధపడుతున్న ఆ పాకిస్తాన్ బాలిక పంజాబ్ అబోహార్ సెక్టార్ ప్రాంతం లోని సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులు గుర్తించారు.

భారత్ కాలమానం ప్రకారం సుమారు ఉదయం పదిన్నర గంటల ప్రాతంలో ఆ పాక్ చిన్నారి అంతర్జాతీయ సరిహద్దులు దాటింది. దీంతో సరిహద్దు స్థావరంలో పనిచేసే అభోర్ సెక్టార్ బీఎస్ఎఫ్ దళానికి చెందిన నతాసింగ్ వాలా బాలికను గమనించారు. భారత భూభాగంలోకి ప్రవేశించిన ఆ బాలిక సరిహద్దు భద్రతా వలయంలోకి చేరినట్లు బీఎస్ఎఫ్ డీఐజీ ఆర్ ఎస్ ఖటారియా తెలిపారు.

అయితే అనుకోకుండా భారత్ లోకి ప్రవేశించిన ఆ ఐదేళ్ల చిన్నారిని ప్రశ్నించడంతో చెవిటి, మూగ అని తెలిసిందని, దీంతో ఆమెకు సంబంధించిన ఎటువంటి వివరాలు వెల్లడించలేక పోయిందని చివరికి పేరు కూడ తెలియలేదని అధికారులు వెల్లడించారు. ఆమె సరిహద్దు దాటి వచ్చిందన్న హెచ్చరికలతో చిన్నారిని పట్టుకున్న దళాలు.. అనంతరం పాకిస్తాన్ రేంజర్స్ ను సంప్రదించి మానవతా దృక్పథంతో ఆ బాలికను ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు