52 విమానాలు రద్దు, 55 దారి మళ్లింపు

2 Jul, 2019 16:49 IST|Sakshi

సాక్షి, ముంబై:   ఎడతెరిపిలేని వర్షాలతో  వాణిజ్య రాజధాని ముంబై మహానగరం అతలాకుతలమవుతోంది.  రవాణా వ్యవస్థ స్థంభించడంతో నగర వాసులు ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా భారీ వర్షాలతో ముంబై విమానాశ్రయంలో ప్రధాన రన్‌వేను   సోమవారం మూసివేశారు.  జైపూర్‌ నుంచి  ముంబైకి చేరిన  స్పైస్‌ జెట్‌ విమానం  రన్‌వే తో అధికారులు ఈ  నిర్ణయం తీసుకున్నారు.  గత ఆదివారం   నుంచి 540 మిల్లీమీటర్ల వర్షం నమోదైందనీ, గతపదేళ్లలో  లేని వర్షపాతం రెండు రోజుల్లో  కురిసిందని ముంబై మున్సిపల్‌ కమిషనర్‌  ప్రవీణ్‌ పరదేశ్‌ వెల్లడించారు.  జూన్‌ నెల సగటు వర్షపాతం 515 మిల్లీమీటర్లని  చెప్పారు

రెండవ రన్‌వే ద్వారా మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో  పలు విమానాలను దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు  చేసినట్టు అధికారులు ప్రకటించారు.  26 అంతర్జాతీయ  29 డొమెస్టిక్‌  మొత్తం 55 విమానాలు దారి మళ్లింగా, 52 విమానాలు రద్దు చేశారు.  సమీప విమానాశ్రయాలు  అహ్మదాబాద్‌ , బెంగళూరు మీదుగా డైవర్ట్‌ చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాలలో సియోల్ -ముంబై కొరియా విమానం,  ఫ్రాంక్‌ఫర్ట్  లుఫ్తాన్సా విమానాన్ని, బ్యాంకాక్  నుంచి  రానున్న  ఎయిర్ ఇండియా విమానాన్ని దారి మళ్లించారు.  దీంతో పాటు  రైలు సేవలను కూడా ప్రభావితం చేశాయి. తాత్కాలికంగా సబర్బన్‌ రైళ్లను నిలిపివేస్తున్నట్టు సెంట్రల్ రైల్వే  ప్రకటించింది.  కాగా వర్ష బీభత్సంతో మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.  వర్షాలు, గోడ కూలిన సంఘటనల్లో ముంబై, పూణే  నగరాల్లో 20 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు