ఇక లొల్లి అలహాబాద్ యూనివర్సిటీలో!

5 Mar, 2016 10:12 IST|Sakshi
ఇక లొల్లి అలహాబాద్ యూనివర్సిటీలో!

అలహాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఒక్కొక్కటిగా వార్తల్లో నిలుస్తున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్యతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ, జాతి వ్యతిరేక నినాదాల వివాదం నేపథ్యంలో ఢిల్లీలోని జేఎన్యూ పతాక శీర్షికలకు ఎక్కగా తాజాగా అలహాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్.. తనను యూనివర్సిటీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించింది.

యూనివర్సిటీలో కొందరు అధికారుల నియామకాన్ని తాను వ్యతిరేకించడంతో తనను లక్ష్యంగా చేసుకొని యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని అలహాబాద్ యూనివర్సిటీ మొదటి మహిళా విద్యార్థి నాయకురాలు జ్యోతీ సింగ్ ఆరోపించింది. యూనివర్సిటీ అధికారులు తన అడ్మిషన్ను రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె మీడియాతో తెలిపారు.

యూనివర్సిటీ పరిసరాల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ యోగి ఆదిత్యానంత్ నిర్వహించిన కార్యక్రమాన్ని తాను వ్యతిరేకించినప్పటి నుంచి.. తనపై దూషణలు పెరిగాయని ఆమె వెల్లడించింది. కాగా యూనివర్సిటీలో ఆమె ప్రవేశం పొందటంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చేపట్టిన విచారణలో యూనివర్సిటీ అధికారుల తప్పిదం వల్లనే  జ్యోతీ సింగ్కు పరిశోధక విద్యార్థిగా సీటు లభించిందని తేలినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు