వరద సహాయక చర్యలను సమీక్షించిన ఆర్మీ చీఫ్

28 Jun, 2013 15:26 IST|Sakshi

గౌచర్ : ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిక్రం సింగ్‌ శుక్రవారం ఉత్తరాఖండ్‌లో వరద సహాయ కార్యక్రమాల తీరును సమీక్షించారు. గౌచర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్విరామ సేవలందించిన సైనికులను కొనియాడారు. యాత్రికులను రక్షించండంలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, ఐటీబీపీ విశేషంగా పనిచేశాయని విక్రమం సింగ్‌ ప్రశంసించారు. చివరి వ్యక్తిని తరలించేవరకూ తాము ఉత్తరాఖండ్ లోనే ఉంటామని ఆయన తెలిపారు.

 సిబ్బందిలో చాలామంది ఇదే ప్రాంతానికి చెందినవారని, అయినా వారి సొంత వ్యవహారాలను పక్కనపెట్టి- విధినిర్వహణలో అంకిత భావం ప్రదర్శించారని బిక్రం సింగ్‌ చెప్పుకొచ్చారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన వారికి నివాళిగా కొద్దిసేపు మౌనం పాటించారు.

మరిన్ని వార్తలు