మిలిటరీ వాహనాలపై ఉగ్రవాదుల దాడి

22 Jan, 2017 13:30 IST|Sakshi
మిలిటరీ వాహనాలపై ఉగ్రవాదుల దాడి

గువాహటి: పర్యాటకులకు రక్షణగా వెళుతున్న అసోం రైఫిల్స్‌కు చెందిన వాహనాలపై అనుమానాస్పద ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో ఇద్దరు అధికారులు ప్రాణాలుకోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరిద్దిరి పరిస్థితి విషమంగా ఉంది. అసోం-అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అసోంలోని టిన్‌సుకియ జిల్లాలో 53వ జాతీయ రహదారిపై సరిగ్గా జాగున్‌ 12వ మైల్‌ బారబస్తీ వద్ద మిలిటీరీ వాహనాలపై ఉగ్రవాదులు గ్రనేడ్‌తో దాడికి దిగారు. అనంతరం కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న జవాన్లు తిరిగి ఎదురుకాల్పులు  ప్రారంభించారు. ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. పాంగ్‌సౌ ఉత్సవానికి వెళ్లొస్తున్న పర్యాటకులకు గస్తీగా మూడు మిలిటీరీ వాహనాలు వెళుతుండగా ఈ దాడి జరిగింది. ప్రస్తుతానికి పర్యాటకులను జాతీయ రహదారికి కొంత దూరంలో నిలిపి చుట్టుపక్కల కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు