రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ కమిటీ

13 Jun, 2017 01:59 IST|Sakshi
రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ కమిటీ

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపే ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. సోమవారం ఈ మేరకు ముగ్గురు కేంద్ర మంత్రులతో కూడిన ఒక కమిటీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఏర్పాటు చేశారు. మంత్రులు రాజ్‌నాథ్, జైట్లీ, వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి అనువుగా అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం సాధిం చడానికి వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని ఈ కమిటీని అమిత్‌ ఆదేశించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఏకగ్రీవం కాని పక్షంలో జూలై 17న పోలింగ్, 20న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

వేచిచూసే ధోరణిలో ప్రతిపక్షాలు
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై చర్చలు జరిపేందుకు ప్రతిపక్షాలు కూడా రంగం సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో అధికార ఎన్డీయే కూటమి ప్రతిపాదన స్పష్టమయ్యేవరకూ వేచిచూ డాలనే ధోరణిని ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్నా యి. అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యూహాన్ని రూపొందించడానికి ప్రతిపక్ష పార్టీల నేతలతో కూడిన కమిటీ బుధవారం సమావేశం కానుంది.

>
మరిన్ని వార్తలు