ఎన్నికల ప్రచారంలో ఐటమ్ గర్ల్!

16 Mar, 2016 10:23 IST|Sakshi
ఎన్నికల ప్రచారంలో ఐటమ్ గర్ల్!

గువాహతి: అసోంలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో తాను ప్రచారం చేయాలని బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ నిర్ణయించుకుంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) తరఫున అథవాలే నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఆర్పీఐ పార్టీ మహారాష్ట్రలోని దళితుల హక్కుల కోసం పోరాడుతోందన్ విషయం తెలిసిందే. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ బాటలో ఈ పార్టీ పోరాటం సాగిస్తోంది. ఆ పార్టీ రాజకీయాలలో ఈ మధ్య ప్రేవేశించింది. ఆర్పీఐ పార్టీ మహిళా విభాగానికి చీఫ్ గా రాఖీ పనిచేయనుంది. సింగర్, నటి సల్మా అఘ్నాను కూడా ప్రచారానికి దించనున్నట్లు ఆర్పీఐ కార్యదర్శి నాథుని తెలిపారు. అభ్యర్థుల తొలి జాబితాను ఇటీవలే ఆ పార్టీ ప్రకటించింది. త్వరలోనే మిగతా అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని నాథుని పేర్కొన్నారు.

ఆమె ప్రచారం చేయడం, ఈ కార్యక్రమాలలో పాల్గొనడం తమకు కలిసొచ్చే అవకాశం ఉందని పార్టీ పెద్దలు చెబుతున్నారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను రక్షించడమే తమ పార్టీ పని అని, రాఖీ సావంత్ తమ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్దంగా ఉందని ఆర్పీఐ ప్రధాన కార్యదర్శి నాథుని వెల్లడించారు. అయితే, తనకు పోర్న్ స్టార్ అవ్వాలని ఉందని రాఖీ సావంత్ వ్యాఖ్యలు చేసిన నెలరోజుల్లోనే ఆర్పీఐ పార్టీ ఆమెకు ప్రచార బాధ్యతలు అప్పగించించడం అక్కడ చర్చనీయాంశంగా మారింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా