‘సీ’ ఫర్‌ చోర్‌.. నెహ్రూ దొంగల ప్రధాని

8 Mar, 2018 17:52 IST|Sakshi
పాఠాలు బోధిస్తున్న టీచర్‌

ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలకు ఓ టీచర్‌ పాఠాలు

సోషల్‌ మీడియాలో వైరల్‌

రాంచీ : జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాల్లో టీచర్‌ బోధించిన పాఠాలు విద్యావ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. హిందీ అక్షరమాల బోధిస్తున్న సదరు టీచర్‌ చ- అంటే చోర్‌( దొంగ) అని, భారత తొలి ప్రధాని  పండిట్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ దొంగల ప్రధాని అని బోధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్‌లోని కుతి గ్రామ ప్రభుత్వ పాఠశాల్లో ఈ ఘటన చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

పాఠశాలకు భవన సౌకర్యం లేకపోవడంతో ఆ టీచర్‌ చెట్టు కింద బోర్డుపై పిల్లలకు హిందీ అక్షరమాల నేర్పించాడు. ఇందులో భాగంగా చ- అంటే చోర్‌ అని,  చాచా నెహ్రూ దొంగల ప్రధాని అనే వ్యాఖ్యాన్ని చెబుతూ .. పిల్లలతో చెప్పించాడు. ఇలా భోదిస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి మీడియాకు అందించారు.  ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులను వివరణ కోరగా.. విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యాశాఖ తరుఫున క్షమాపణలు తెలుపుతున్నామన్నారు.

అయితే ఇలా టీచర్లు ఇంకిత జ్ఞానం లేకుండా బోధించడం తొలి సారేం కాదు. గతంలో బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. అయితే బోధించే పాఠ్యంశంపై అవగాహన లేని టీచర్లు ఎందరో ఉంటున్నారని, వీరంతా పరీక్షల్లో అవతవకలు పాల్పడి ఉద్యోగాలు పొందుతున్నట్లు విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు