గాల్లో ఐదుగురు బంతిలా ఎగిరిపడ్డారు

11 Feb, 2016 16:10 IST|Sakshi
గాల్లో ఐదుగురు బంతిలా ఎగిరిపడ్డారు

చెన్నై: చెన్నైలో ఓ కారు భీభత్సం సృష్టించింది. అడ్డొచ్చిన వారిని గాల్లోకి బంతుల్లాగా ఎగరేసింది. దాని వేగం భారిన పడిన మొత్తం ఐదుగురిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా కూడా చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో ఉంచిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందులో రికార్డయిన ప్రకారం చెన్నైలోని మంగళవారం రాత్రి ఓ వీధిలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్లగా మరో ముగ్గురు వ్యక్తులు కాస్త రోడ్డు మీదుగానే నడుస్తూ వెళుతున్నారు.

అదే సమయంలో ఓ గోడకు ఢీకొని అదుపుతప్పి వేగంగా దూసుకొచ్చిన ఎర్రటి శాంత్రో కారు వారిని బలంగా ఢీకొట్టింది. అందులో ముగ్గురు చెల్లా చెదురుగా పడిపోగా మరో ఇద్దరు కొద్ది సేపు కారు బానెట్పైనే ఉండిపోయి కొద్ది సేపటి తర్వాత గాల్లోకి బంతుల్లాగా ఎగిరిపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగితావారు గాయాలపాలయ్యారు. అయితే, ఆ కారు డ్రైవర్ను వెంకటేశ్ అనే వ్యక్తిగా గుర్తించారు. అతడు మంచి అనుభవం ఉన్న డ్రైవరేనని, కానీ గోడకు కారు ఢీకొనడంతో బ్రేక్ వేయాల్సింది అనుకోకుండా ఎక్స్లేటర్మీద కాలు పెట్టడం వల్ల అమాంతం కారు పాదచారులపైకి దూసుకెళ్లిందని పోలీసులు చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు