సీబీఎస్‌ఈ టెన్త్‌ ఫలితాలు విడుదల

6 May, 2019 18:38 IST|Sakshi

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) పదో తరగతి ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. 91 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 17,61,078 పరీక్షలు రాయగా 16,04,428 విద్యార్థులు పాసయ్యారు. బాలురు కంటే బాలికలు 2.31 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 92.45 శాతం, బాలురు 90.14 శాతం ఉత్తీర్ణత సాధించారు.

13 మంది విద్యార్థులు ఎఐఆర్‌ గ్రేడ్‌-1 సాధించారు. వీరంతా 500 గానూ 499 మార్కులు సాధించారు. టాపర్స్‌లో ఏడుగురు బాలురు, ఆరుగురు బాలికలు ఉన్నారు. 25 మంది విద్యార్థులు 500 గానూ 498 మార్కులు సాధించి ఎఐఆర్‌ గ్రేడ్‌-2 పొందారు. 59 మంది విద్యార్థులు(497/500) ఎఐఆర్‌ గ్రేడ్‌-3 దక్కించుకున్నారు. భారత్‌ వెలుపల 98 కేంద్రాల్లో 40,296 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసినట్టు సీబీఎస్‌ఈ వెల్లడించింది. 

పదో తరగతి పాసైన విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అభినందనలు తెలిపారు. కేంద్రీయ విద్యాలయాలు(99.47 శాతం), జవహర్‌ నవోదయ విద్యాలయాలు (98.57 శాతం) మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల జవదేకర్‌ హర్షం ప్రకటించారు. 

>
మరిన్ని వార్తలు