18 రకాల పురుగు మందులపై నిషేధం

4 Jan, 2017 03:22 IST|Sakshi

కేంద్ర వ్యవసాయశాఖ

సాక్షి, హైదరాబాద్‌
: పురుగు మందులతో పండిం చే పంటలన్నీ విషపూరితం అవుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ‘కొన్ని రకాల పురుగు మందులతో పండించే పంటల వల్ల మానవుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. పర్యావరణం దెబ్బతింటుంది. భూమి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయి. ఆయా పంటలు తినే పశు పక్ష్యాదులు, మానవజాతి తీవ్ర ప్రమా దంలో పడింది. క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులు జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నా యి’అని కేంద్ర వ్యవసాయశాఖ స్వయంగా తేల్చి చెప్పింది. అందుకే 18 రకాల పురుగు మందుల ను నిషేధిస్తూ తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖకు తెలియజెప్పింది. అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అమెరికా వంటి దేశాల్లో ఎప్పుడో వీటిని నిషేధించగా.. కేంద్రం ఇప్పుడు మేల్కొంది.

పురుగుమందుల నిషేధపు ఉత్తర్వు–2016
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటి ఫికేషన్‌ను ‘పురుగుమందుల నిషేధపు ఉత్తర్వు– 2016’గా పిలుస్తారు. వాస్తవంగా దేశంలో ఏ పురుగు మందులు ప్రమాదకరమో నిర్ధారించేం దుకు 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రపంచంలో నిషేధంలో ఉన్న 66 రకాల పురుగు మందులు భారతదేశంలోనూ వినియోగిస్తున్నా రని తేల్చింది. చివరకు ఆ కమిటీ నిషేధించా ల్సిన పురుగు మందు లపై వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. అందులో 18 రకాల పురుగు మందులను నిషేధించాలని నివేదించింది. ఇవి మనుషులు, జం తుజాలానికి తీవ్ర ప్రమాదం (హైరిస్క్‌) కలిగిస్తా యని పేర్కొంది. అందువల్ల తక్షణమే చర్యలకు విన్నవించింది.

నిషేధించిన 18 రకాల పురుగు మందులివే
► హాబెనోమిల్‌. ఈ తెగులు మందును పంటలకు మచ్చలు వస్తే వాడుతారు. ఇది చల్లిన పంటను తినే పశుపక్ష్యాదులు, మనుష్యులపై ప్రభావం చూపుతుంది. గర్భిణులకు హాని చేస్తుంది.
► హాకార్బరిల్‌ పురుగు మందును పంటలకు ఒకసారి వేస్తే దాని ప్రభావం ఆ పంటపై దాదాపు 45 రోజులు ఉంటుంది. కూరగాయల పంటలపై ఈ పురుగు మందును చల్లితే ఎంత కడిగినా అది పోదు. అది మన శరీరాన్ని విషమయం చేస్తుంది.
► హాడయాజినాన్‌ కూడా పురుగుమందే. ఇది జీవజాతిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
► హాసోడియం సైనేడ్‌. ఇది సైనేడ్‌ అంత స్పీడ్‌గా జీవజాతిని నాశనం చేస్తుంది.
► హాఅలాగే ఫెనారిమోల్, ఫెన్‌తియాన్, లిను రాన్, ఎంఈఎంసీ, మిత్యాల్‌ పారతియాన్, తైమి టాన్, త్రైడిమార్ప్, ట్రిఫ్లురాలిన్, అలాక్లోర్, వైచ్‌ లార్‌వోస్, పోరేట్, పాస్పమిడాన్, త్రైయా జోఫాస్, త్రైక్లోర్‌ఫాన్‌లు ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు