కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పాటు...

14 May, 2020 14:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కూడా మనం చాలా కాలం కరోనా వైరస్‌తో కలిసి సహజీవనం చేయాల్సి ఉంటుందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా అభిప్రాయపడ్డారు. చాలాకాలం పాటు సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వాడటం నిత్యవసరంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్పిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై ప్రతిపాదనలతో కూడిన మూసాయిదా రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనపై మంత్రులు శాఖల వారిగా సమీక్షించి నిర్వహించి తమ ప్రతిపాదనలను అందజేయాలని కోరింది. దీనికి సంబంధించిన పత్రాలను ఆయా  శాఖలకు పంపించింది. (బ్యాంకు క్యూలో నిల్చుంది కరోనాతో చనిపోయింది.)

ఈ విధానం ప్రకారం ఇంటి నుంచి పనిచేయడానికి అవకాశం ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరంలో 15 రోజుల వరకు వర్క్‌ఫ్రం హోం చేసే వీలు కల్పించే విధంగా ముసాయిదాలో ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. మొత్తం దేశంలో 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇంటి నుంచి పని చేయడానికి సంబంధించి సాధ్యాాసాధ్యాలతో పాటు ఇతర అంశాలపై మంత్రులు, సంబంధిత అధికారులు మే 21 లోగా తమ ప్రతిపాదనలను అందజేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇలాంటి పలు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. దేశంలో ఇప్పటివరకు 78,000లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 2,549 మంది చనిపో​యారు. 26,000 మంది కోలుకున్నారు.  (వాటిని చైనాకు పంపించేయనున్న కెనడా)

మరిన్ని వార్తలు