అవంతిక వీసా విషయంలో దిగొచ్చిన పాక్‌

13 Jul, 2017 16:49 IST|Sakshi
దిగొచ్చిన పాక్‌.. జాదవ్‌ తల్లికి వీసా పరిశీలన
ఇస్లామాబాద్‌: గూఢచర్యం కేసులో ప్రస్తుతం మరణ శిక్షను ఎదుర్కొంటున్న కులభూషణ్‌ జాదవ్‌ తల్లి అవంతిక జాదవ్‌కు వీసాను ఇచ్చే విషయం ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు పాకిస్థాన్‌ విదేశాంగ కార్యాలయం చెప్పిందని పాక్‌ మీడియా వెల్లడించింది. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ జోక్యం చేసుకున్న మూడు రోజుల తర్వాత గానీ, దీనికి సంబంధించిన కదలిక మొదలుకాలేదు. కులభూషణ్‌ జాదవ్‌ ప్రస్తుతం పాక్‌ జైలులోనే ఉరి శిక్షకు గురై జైలులో మగ్గుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అతడిని చూసేందుకు తనకు అనుమతివ్వాలని, వీసా ఇవ్వాలని జాదవ్‌ తల్లి అవంతిక జాదవ్‌ వీసా దరఖాస్తు కోరారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రికి భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ గత సోమవారం తెలియజేశారు. అయితే, ఆ సమయంలో పాక్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సుష్మా వ్యక్తిగతంగా సర్తాజ్‌ అజీజ్‌కు లేఖ రాసినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఘాటు వ్యాఖ్యలతో మండిపడుతూ సుష్మా ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని వార్తలు