2జీ స్పెక్ట్రమ్‌ కేసుల కథాకమామిషు

22 Dec, 2017 05:17 IST|Sakshi

సీబీఐ వర్సెస్‌ ఎ.రాజా (ఏ–1),సిద్ధార్ధ బెహురా (ఏ–2), ఆరేకే చందోలియా (ఏ–3),షాహిద్‌ ఉస్మాన్‌ బల్వా (ఏ–4) వినోద్‌ గోయెంకా (ఏ–5),  కనిమొళి కరుణానిది (ఏ–17) తదితరులు
చార్జిషీట్‌లోని ప్రధానాంశాలు ః 2008లో యూనిఫైడ్‌ యాక్సెస్‌ సర్వీసెస్‌( యూఏఎస్‌) లైసెన్స్‌ల ఎంట్రీ ఫీజును టెలికాం శాఖ రూ.1,658గా నిర్ధారించింది. 2001లో టెలికాం శాఖ సెల్యులర్‌ మొబైల్‌ టెలిఫోన్‌ సర్వీస్‌ (సీఎంటీఎస్‌)లైసెన్స్‌లను వేలం వేశాక ఎంత మొత్తం వచ్చిందో 2008లోనూ «అవే ధరలను నిర్ణయించారు. యూఏఎస్‌ లైసెన్సులకు దరఖాస్తు చేసుకోవాలని 2007 సెప్టెంబర్‌ 25న ప్రకటన జారీచేసి, అక్టోబర్‌ 1 తరువాత వచ్చే వాటిని స్వీకరించమని టెలికాం శాఖ పేర్కొంది. కొన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకే ఈ మార్పు చేశారు. లైసెన్సుల కేటాయింపు నియమ నిబంధనల్లో మంత్రి రాజా ఆధ్వర్యంలో పలు మార్పులు జరిగాయి. కొన్ని కంపెనీలు వేలంలో పాల్గొనకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వర్సెస్‌ 1) రాజా, 2) షాహిద్‌ ఉస్మాన్‌ బల్వా, 3) వినోద్‌ గోయెంకా, 4)ఆసిఫ్‌ బల్వా, 5) రాజీవ్‌ అగర్వాల్, 6)కరీం మెరానీ 7)శరద్‌ కుమార్‌ 8) ఎంకే దయాళు అమ్మాళ్, 9) కనిమొళి కరుణానిధి 10)పి.అమృతం, 11)మెసెర్స్‌ స్వాన్‌ టెలికాం 12)మెసెర్స్‌ సినీయుగ్‌ మీడియా తదితరులు.
ఈడీ ప్రధాన అభియోగాలు ః సీబీఐ కేసుకు అదనంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ. నిందితులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు రూ.223.55 కోట్ల ఆస్తుల జప్తు సందర్భంగా స్పష్టమైనట్లు వెల్లడి. తాము నమోదుచేసిన కేసుకు సంబంధించి తగిన ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్న ఈడీ. మనీలాండరింగ్‌ ద్వారా సంపాదించిన సొమ్ము ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయా వ్యక్తులు, సంస్థల వద్దే ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు వెల్లడి.   

సీబీఐ వర్సెస్‌ 1) రవికాంత్‌ రుయా, 2) అన్షుమన్‌ రుయా, 3) ఐపీ ఖైతాన్, 4) కిరణ్‌ ఖైతాన్‌ 5) వికాస్‌ షరాఫ్‌  తదితరులు
చార్జిషీటులోని అంశాలుః లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ సమర్పించిన అన్ని కంపెనీల అర్హతలను పరిశీలించిన సీబీఐ. 2007 సెప్టెంబర్‌లో లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న మెసెర్స్‌ లూప్‌ టెలికాం మెసెర్స్‌ ఎస్సార్‌ గ్రూపు బినామి అని తెలిసింది. యూఏఈ లైసెన్స్‌తో 2005 నుంచే ముంబయి సర్వీస్‌ ఏరియాలో మెసెర్స్‌ మొబైల్‌ ఇండియా కార్యకలాపాలు కొనసాగించింది. మెసర్స్‌ వొడాఫోన్‌ ఎస్సార్‌ లిమిటెడ్‌లో అప్పటికే మెసర్స్‌ గ్రూపునకు 33 శాతం వాటా ఉన్నట్లు నిర్ధారణ.    –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు