సీవీసీ నియామక ప్రక్రియ షురూ

22 Jul, 2014 02:46 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత అంశంపై స్పీకర్ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. అరుునప్పటికీ కేంద్రం సోమవారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) నియూమక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నామినేషన్లు కోరింది. నిజారుుతీగా, నిష్పాక్షికంగా వ్యవహరించే, ఈ పోస్టుకు పరిశీలించదగిన వారి పేర్లను సూచించాల్సిందిగా కోరుతూ కేబినెట్ కార్యదర్శితో పాటు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) లేఖ రాసింది.

సీవీసీతో పాటు సీవీసీ కార్యాలయంలో విజిలెన్స్ కమిషనర్  పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. నిబంధనల ప్రకారం.. ప్రధాని నేతృత్వంలోని హోం మంత్రి, ప్రతిపక్ష నేతలతో కూడిన త్రిసభ్య సెలెక్షన్ కమిటీ సిఫారసు ఆధారంగా రాష్ట్రపతి సీవీసీ, వీసీల నియూమకం చేపడతారు. ప్రతిపక్ష నేత ఖరారుకాని పక్షంలో ఏకైక అతిపెద్ద పార్టీ నేత.. ప్రతిపక్ష నేతగా ఉంటారని డీవోపీటీ కార్యదర్శి ఇతర మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు రాసిన లేఖలోని మార్గదర్శకాలు పేర్కొన్నారుు.
 
 

మరిన్ని వార్తలు