ఆన్ లైన్ డేటింగ్.. చిక్కితే తిప్పలే!

28 Sep, 2016 18:04 IST|Sakshi
ఆన్ లైన్ డేటింగ్.. చిక్కితే తిప్పలే!

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. అయితే నో ప్రాబ్లమ్. స్మార్ట్ ఫోన్ ద్వారా గేమ్స్ ఆడటం, ఆన్ లైన్ లో బిల్లులు చెల్లించడం, ఇతర లావాదేవీలు చేయడం వరకూ ఎలాంటి సమస్య లేదు. కానీ ఆన్ లైన్ యూజర్లు ముఖ్యంగా డేటింగ్ సర్వీసును అందించే యాప్స్ వాడుతున్న భారతీయులు సమస్యలు ఎదుర్కొంటున్నారట. ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ వాడే ప్రతి ఐదుగురు భారతీయులలో ముగ్గురికి(దాదాపు 60శాతం యూజర్లు) కచ్చితంగా సెక్యూరిటీ ఇబ్బందులు తప్పడం లేదట. తాజాగా బుధవారం విడుదలైన ఓ సర్వేలో ఈ విషయాలు బహిర్గమయ్యాయి.

భారత్ లో దాదాపు 38 శాతం యూజర్లు ఆన్ లైన్ డేటింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. 8 శాతం మహిళలు, 13 శాతం పురుషులు తమ స్మార్ట్ ఫోన్లలో డేటింగ్ సర్వీస్ యాప్స్ వాడుతున్నారు. 16 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న 1005 మంది ఇండియన్ స్మార్ట్ యూజర్లపై సర్వే చేసినట్లు మార్టన్ మొబైల్ సర్వే వారు తెలిపారు. 64శాతం మంది మహిళలు తమ డేటింగ్ భాగస్వాములతో పాటు వైరస్ ప్రొగామ్స్ ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్నారని, అదే విధంగా పురుషులు కూడా సైబర్ క్రైమ్ నేరాలలో చిక్కుకుంటున్నారు.

వైరస్ వల్ల 23శాతం, యాడ్స్ వల్ల 13శాతం, సైబర్ క్రైమ్స్ 9శాతం, ప్రీమియం సర్వీసులు 9శాతం, ఐడెండిటీ చోరీ సమస్యలు 6శాతం, ప్రతీకార సెక్స్ క్రైమ్ 4శాతం మంది యూజర్లు ఆయా విభాగాల వారీగా సమస్యలతో బాధపడుతున్నారు. నగరాల వారీగా చూస్తే.. న్యూఢిల్లీలో 51శాతం, చెన్నైలో 39శాతం, కోల్ కతాలో 36శాతం, ముంబై,  అహ్మదాబాద్ లో 35శాతం యూజర్లు కనీసం ఓసారి డేటింగ్ యాప్స్ వినియోగించినట్లు సర్వేలో వెల్లడైంది. దక్షిణాది నగరాలైన చెన్నైలో 20శాతం యూజర్లు, హైదరాబాద్ యూజర్లలో 21శాతం మంది ఈ యాప్స్ కారణంగా సమస్యలలో ఇరుక్కుంటున్నట్లు సర్వే బృందం తెలిపింది.

సైబర్ నేరాలు, ఇతర భద్రతాపరమైన సమస్యల వలయంలో బాధితుడు/బాధితురాలు కాకూడదంటే ఇలాంటి ఆన్ లైన్ డేటింగ్ యాప్స్, అదే తరహాలో ఉండే మరిన్ని యాప్స్ ను వినియోగించరాదని సర్వే చేసిన నార్టన్ మొబైల్ సర్వే సభ్యులు సూచించారు.

>
మరిన్ని వార్తలు