ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?

4 Nov, 2016 09:18 IST|Sakshi
ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?

న్యూఢిల్లీ: తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు నిర్బంధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రోజుల వ్యవధిలో మూడుసార్లు రాహుల్ గాంధీని చట్టంలోని ఏ నిబంధనల ప్రకారం అదుపులోకి తీసుకున్నారని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. రాహుల్ అక్రమ నిర్బంధంపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ అయిన రాహుల్ గాంధీ పట్ల ఇంత చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు.

ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ మాజీ జవానుకు నివాళిగా నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో రాజకీయ నేత పాల్గొనడం నేరమా, మృతుడి కుటుంబాన్ని రాజకీయ నాయకుడు పరామర్శించడం చట్టవిరుద్ధమా అని ట్విట్టర్ లో దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు