పసిమొగ్గలపై రాక్షసత్వమా..?

4 Jul, 2018 20:00 IST|Sakshi
బాలీవుడ్‌ నటి దియా మీర్జా (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో చిన్నారులపై పెరుగుతున్న లైంగిక దాడుల పట్ల బాలీవుడ్‌ నటి దియా మీర్జా ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలపై తీవ్ర నేరాలకు పాల్పడుతున్న వారిని మతం, ప్రాంతాలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడే నిందితుల పట్ల ఎవరూ సానుభూతి చూపరాదని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నేరస్థుడి మతం, కులం, ప్రాంతాలకు అతీతంగా తీర్పులు ఉండాలని ఆకాంక్షించారు.

ముంబైలో సేవ్‌ ద చిల్ర్డన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న దియా మీర్జా వీధి బాలలకు విద్యాబోధనలో చొరవ చూపుతున్నారు, ఈ పిల్లలకు గుర్తింపు ధ్రువీకరణ కోసం వీరికి ఆధార్‌ కార్డులు ఇప్పించేందుకు తమ బృందం కృషి చేస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు