ఢిల్లీలో మళ్లీ భూకంపం

13 Apr, 2020 14:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మళ్లీ భూమి స్వల్పంగా కంపించింది. సోమవారం మధ్యాహ్నం తక్కువ తీవ్రత కలిగిన భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై ఇది 2.7గా నమోదైంది. కాగా నిన్న (ఆదివారం) కూడా ఢిల్లీలో భూకంపం వచ్చింది. వరుసగా భూమి కంపించడంతో జనం భయాందోళనలకు గురి అవుతున్నారు. కాగా నగరంలోని కొన్ని ప్రాంతాలలో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ ( ఎన్‌సీఎస్‌) తెలిపింది. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం గానీ , ప్రాణ నష్టంగానీ వాటిల్లలేదు.  24 గంటలలో ఢిల్లీలో భూమికంపించడం ఇది రెండవ సారి. సోమవారం నాటి భూకంప కేంద్రం భూమికి 5 కిమీల లోతున మాత్రమే ఉండగా ఆదివారం భూకంప కేంద్రం 7  కిమీల లోతున ఉందని జాతీయ భూకంప  కేంద్రం (ఎన్‌సీఎస్‌) డైరక్టర్‌ జెఎల్‌ గౌతం చెప్పారు.

మరిన్ని వార్తలు