లాలూ కూతురి ఫామ్ హౌజ్.. ఈడీ అటాచ్

5 Sep, 2017 14:00 IST|Sakshi
లాలూ కూతురి ఫామ్ హౌజ్.. ఈడీ అటాచ్
సాక్షి, న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఆయన కూతురు మిసా భారతి ఓ ఇంటిని మంగళవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ అటాచ్ చేసేసింది.
 
ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో మిసా పేరిట ఉన్న పామ్ హౌజ్ ను ఈడీ జప్తు చేసింది. బినామీ ఆస్తుల వ్యవహారం ఆరోపణలు వెలుగుచూడటంతో లాలూ మరియు ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూలై 11న ఈడీ అధికారులు మిసా భారతిని 8 గంటలపాటు ప్రశ్నించారు.  ఆమె భర్త శైలేష్ కుమార్ ను కూడా సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ఈడీ.. మిసా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని పలుమార్లు కోరింది కూడా.  ఇక 8000 వేల కోట్ల స్కాంగా భావిస్తున్న ఈ కేసులో మిసా  ఛార్టెడ్ అకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్ ను పేరును ఛార్జీషీట్ లో చేర్చిన విషయం తెలిసిందే. 
 
ఢిల్లీ జూలై 8న సీబీఐ సంస్థ కూడా ఢిల్లీలోని ఆమె నివాసాల్లో సోదాలు నిర్వహించి విచారణ చేపట్టింది. ఓవైపు సీబీఐ, మరోవైపు ఆదాయ పన్నుల శాఖ, ఇంకోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టోరేట్... ఇలా దర్యాప్తు సంస్థలన్నీ ఒక్కసారిగా లాలూ కుటుంబానికి విచారణ పేరిట ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
మరిన్ని వార్తలు