చందా కొచర్‌పై మనీల్యాండరింగ్‌ కేసు

3 Feb, 2019 17:52 IST|Sakshi

ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్‌-వీడియాకాన్‌ రుణాల వ్యవహారం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ చీఫ్‌ చందా కొచర్‌, ఆమె భర్త దీపక్‌ కొచర్‌, వీడియోకాన్‌ గ్రూప్‌ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌ ఇతరులపై మనీల్యాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌-వీడియాకాన్‌ రుణం కేసులో రూ 1875 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఫిర్యాదు ఆధారంగా మనీల్యాండరింగ్‌ చట్టం కింద ఆయా నిందితులను ప్రస్తావిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌)ను ఈడీ నమోదు చేసింది.

కాగా, ఈడీ ఈసీఐఆర్‌ పోలీస్‌ ఎఫ్‌ఐఆర్‌తో సమానం. రుణ వ్యవహారంలో స్వీకరించిన ముడుపులు ఆస్తుల కొనుగోలుకు దారి మళ్లించారా అనే కోణంలో విచారణ సాగుతుందని ఈడీ అధికారులు వెల్లడించారు. ఈసీఐఆర్‌లో నిందితులకు త్వరలోనే ఈడీ సమన్లు జారీ చేయనుంది.  ఇదే కేసులో సీబీఐ ఇప్పటికే చందా కొచర్‌ దంపతులతో పాటు వీడియాకాన్‌ చీఫ్‌ వేణుగోపాల్‌ ధూత్‌ ఇతరులపై చార్జిషీటు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ కీలక సోదాలు, దాడులు చేపట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ వీడియోకాన్‌కు రుణాలు జారీ చేయడంలో క్విడ్‌ప్రోకో జరిగినట్టు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు