జూలై చివరినాటికి భారత్ ‌చేతికి

15 May, 2020 15:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: త్వరలోనే భారత వాయు సేన మరింత పటిష్టం కానుంది. నాలుగు రాఫెల్‌ యుద్ద విమానాలు  వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి. ఇప్పటికే ఈ యుద్దవియానాలు భారత్‌ చేరుకోవలసి ఉండగా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఇవి జూలై నెల చివరి నాటికి భారత్‌ చేతికి దక్కనున్నాయి. అయితే దీనికి సంబంధించిన తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఫ్రాన్స్ ఈ యుద్ద విమానాలను భారత్‌కు అందించనుంది. మొదట మే నెలలో ఈ యుద్ద విమానాలు మన దేశానికి చేరుకోవలసి ఉండగా కరోనా కారణంగా చేరుకోలేకపోయాయి.

(ఎంజాయ్ చేసేందుకు ఇక్కడకు రావొద్దు: సీఎం)

ఈ విమానాల కొనుగోలులో కీలకపాత్ర పోషించిన ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియా గౌరవార్థం ఈ యుద్దవిమానాలకు టైల్‌ నెంబర్‌ ఆర్‌బీ సిరీస్‌ను ఇ‍వ్వనున్నారు. ఈ నాలుగు యుద్దవిమానాల్లో మూడు రెండు సీట్ల ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కాగా, ఒకటి సింగిల​ సీటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌. ఇవి అంబాలా ఎయిర్‌ బేస్‌ దగ్గర జూలై నెలలో భారత వాయుసైన్యంలో చేరనున్నాయి. మొదటి ఎయిర్‌క్రాఫ్ట్‌ని 17 గోల్డెన్‌ యారోస్‌ స్వ్కాడెన్‌కి చెందిన ఫైలెట్‌ నడుపునున్నాడు. భారత్‌కు చెందిన 7గురు ఫైలెట్లు ఇప్పటికే ఫ్రెంచ్‌ ఎయిర్‌బేస్‌లో దీనికి సంబంధించిన ట్రైనింగ్‌ను పూర్తి చేసుకోగా, రెండో బ్యాచ్‌ లాక్‌డౌన్‌ చర్యలు ఫ్రాన్స్‌, భారత్‌లో పూర్తి కాగానే ట్రైనింగ్‌కు హాజరవుతారు. ఈ యుద్ద విమానాలు భారత్‌ చేతికి వస్తే సరిహద్దులో పాకిస్తాన్‌, చైనాతో ఉండే ఉద్రిక్తతలు కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. (అడ్వకేట్ల డ్రస్కోడ్ మారింది, ఇకపై వారు...)

>
మరిన్ని వార్తలు