లాక్‌డౌన్‌‌: గంగా నీరు తాగొచ్చు!

23 Apr, 2020 09:12 IST|Sakshi

డెహ్రాడూన్‌: కరోనా వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్‌డౌన్‌తో పలు నదుల్లోని నీటి కాలుష్యం తగ్గి నాణ్యత పెరుగుతోంది. దేశంలోనే పెద్ద నదిగా గుర్తింపు పొందిన గంగానదిలోని నీరు తేటగా మారుతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలు స్థానికంగా ఉన్న గంగా నదిలోకి వెళ్లి కలవటం వల్ల తీవ్ర కాలుష్యానికి గురైన విషయం తెలిసిందే. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గంగా నదిలోని కాలుష్యాన్ని తగ్గించడానికి పలు కార్యక్రమాలు చేపట్టాయి. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు రాలేదు. ఇక లాక్‌డౌన్‌తో హరిద్వార్‌, రిషికేశ్‌లో ప్రవహించే గంగనది నీరు మునుపెన్నడు లేని విధంగా శుభ్రపడి తాగడానికి కూడా ఉపయోగపడతాయని ఉత్తరాఖాండ్‌ కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఇలా గంగానది నీరు తాగే విధంగా కాలుష్యం తగ్గటం 2000వ సంవత్సరంలో ఉత్తారఖాండ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అని పేర్కొంది. (లాక్‌డౌన్‌తో మెరుగైన గంగా నది నీటి నాణ్యత)

నాణ్యతను బట్టి గంగానది నీరు రెండు వర్గాలుగా విభజించబడింది. మొదటిది నీటిని వడపోసిన తర్వాత తాగడానికి ఉపయోగించడం​. మరోకటి తాగకుండా కేవలం స్నానానికి వినియోగించటం.  కాగా హరిద్వార్‌లోని హర్‌ కి పౌరి ప్రాంతంలో ప్రవహించే గంగానది మొదటి వర్గంగా మార్పు చెందింది. ప్రస్తుతం ఈ నీటిని వడపోసిన తర్వాత తాగడానికి వీలుంటుందని శాస్తవేత్తలు తెలిపారు. ఇక గంగానదిలోని ఆక్సిజన్‌ స్థాయి కూడా పెరిగిందని బయోలాజిక్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌(బీఓడీ) పేర్కొంది. సాధారణంగా గంగానదిలో 80 శాతం ధూళి, మురుగు నీరు, కాలుష్యం ఉండగా.. లాక్‌డౌన్‌తో గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గంగా నదితోపాటు యమునా నదిలోని నీటి నాణ్యత కూడా మెరుగుపడిందన్నారు.

మరిన్ని వార్తలు