శాతానికి పెరిగిన డీఏ

8 Mar, 2018 02:14 IST|Sakshi

7 శాతానికి పెరిగిన డీఏ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రయోజనం  

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం (డీఏ), కరువు సాయం (డీఆర్‌)ను 2 శాతం పెంచుతూ మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 5 శాతం ఉన్న డీఏ, డీఆర్‌లను 7 శాతానికి పెంచి ఈ ఏడాది జనవరి నుంచే ఆ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. దీంతో 1.1 కోట్లమంది కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి కలగనుంది.‘ధరల పెరుగుదలను తట్టుకునేందుకు డీఏ, డీఆర్‌లను మూలవేతనం/పింఛనుపై 7 శాతానికి పెంచాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ నిర్ణయించింది’ అని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఖజానాపై ఏడాదికి రూ.6,077 కోట్ల అధిక భారం పడనుంది.

► సులభతర వాణిజ్య నిర్వహణ ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని మెరుగుపరచు కునే లక్ష్యంతో రెండు చట్టాలను సవరించేందుకు కేబినెట్‌ ఆమోదం. వాణిజ్య వివాదాలు త్వరగా పరిష్కారమయ్యేందుకు ఈ సవరణలు దోహ దపడతాయి.
► స్వాతంత్య్ర సమరయోధుల పింఛను పథకం ‘స్వతంత్రత సైనిక్‌ సమ్మాన్‌ యోజన’ను 2020 వరకు కొనసాగించేందుకు  ఆమోదం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు