వెయ్యికోట్లతో బయో ఎనర్జీ మిషన్

14 Jun, 2016 16:43 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం  ఇంటిగ్రేటెడ్ బయో ఎనర్జీ మిషన్  లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు  వెయ్యి కోట్ల   రూపాయల వ్యయంతో ఈ పథకాన్ని చేపట్టనుంది. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించడం కోసం  ఇథనాల్,  బయో ఇంధనాలు, బయోగ్యాస్ వాడకం విస్తరించేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ .10,000 కోట్ల వ్యయం తో సమీకృత జీవశక్తి యాత్రను ప్రారంభించడానికి యోచిస్తోంది. న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వశాఖ  ఆధ్వర్యంలో ఈ మిషన్ చేపట్టినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.  దీనికోసం 2017-18 నుంచి 2021-22 వరకు రూ 10,000 కోట్లను  కేటాయించారు.

గ్రీన్ హౌస్ వాయువులను, కర్బన్ ఉద్గారాలను  తగ్గించడమే తమ మిషన్ ఉద్దేశమని ఆయన  చెప్పారు.   సీఓపీ 21 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21  వార్షిక సమావేశం) వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సదస్సులోని (యూఎన్ఎఫ్సీసీ )అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం  ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.  బొగ్గు, పెట్రోలు, డీజిల్, సహజవాయువు, వంటగ్యాస్ బయోమాస్ గుళికలు, బయో ఇథనాల్, బయో డీజిల్, బయో మీథేన్ లాంటి శిలాజ ఇంధనాలకు  ప్రత్యామ్నాయంగా ఒక ప్రగతిశీల సమ్మిశ్రణంకోసం  కృషి చేస్తున్నట్టు తెలిపారు.  ఈ శిలాజ ఇంధనాల ప్రతిక్షేపణ ద్వారా  లక్ష్యం సాధించాలని కోరుకుంటున్నామన్నారు.  కపూర్తలాలోని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బయోఎనర్జీ ని తమ మిషన్ కోసం  వరల్డ్ క్లాస్ సంస్థగా అభివృద్ధి  చేయనున్నట్టు తెలిపారు.   దీంతోపాటుగా ఎంఎన్ఆర్ ఈ మాజీ సలహాదారు ఎకె ధుస్సా  ఆధ్వర్యంలో ఒక టెక్నికల్  కమిటీకి నియమించేందుకు కేంద్రం నిర్ణయించినట్టు తెలిపారు.  ఈ కమిటీ నేతృత్వంలో మిషన్ కు సంబంధించిన విధి విధానాలు  రూపుదిద్దుకుంటాయని అధికారి పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు