భారీ వర్షాలతో చార్ ధామ్ యాత్రకు బ్రేక్

25 Jun, 2015 18:33 IST|Sakshi
భారీ వర్షాలతో చార్ ధామ్ యాత్రకు బ్రేక్

లక్నో/డెహ్రాడూన్: భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రలకు బ్రేక్ పడింది. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతుండటంతోపాటు దిగువ ప్రాంతాల్లో వరదలు వస్తున్న నేపథ్యంలో చార్ ధామ్ యాత్రికుల ప్రయాణాలను గురువారం ఎక్కడికక్కడ నిలిపేశారు. బద్రీనాథ్, కేదర్నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్ ధామ్ అంటారనే విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఈ నాలుగు ప్రాంతాల్లోని దైవాలను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ఇప్పటికే చమోలీ జిల్లాలో భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో బద్రీనాథ్ క్షేత్రానికి బయలు దేరిన దాదాపు పదివేల మంది ఎక్కడికక్కడ నిలిచిపోయారు. గత పన్నెండుగంటలుగా ఏమాత్రం తెరపునివ్వకుండా వర్షం కురుస్తుందని, అది తగ్గిన తర్వాత తిరిగి యాత్రలకు అనుమతిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. అప్పటివరకు యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు