టాప్ టెన్ లో అశ్విన్ | Sakshi
Sakshi News home page

టాప్ టెన్ లో అశ్విన్

Published Thu, Jun 25 2015 6:21 PM

టాప్ టెన్ లో అశ్విన్

దుబాయ్: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో చోటు సంపాదించాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో బౌలర్ల విభాగంలో 10వ స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ఆశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా బంగ్లా పర్యటనకు దూరమైన పేసర్ మహ్మద్ షమీ 12వ ర్యాంకు దక్కించుకున్నాడు. మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా) ఫస్ట్ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

బ్యాటింగ్  విభాగంలో విరాట్ కోహ్లి(4), శిఖర్ ధావన్(7), మహేంద్ర సింగ్(8) టాప్ టెన్ లో ఉన్నారు. ఆల్ రౌండర్ కేటగిరిలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement