‘నేను ఐఎస్‌ఐ ఏజెంట్‌ను’

29 Apr, 2017 03:10 IST|Sakshi
‘నేను ఐఎస్‌ఐ ఏజెంట్‌ను’

న్యూఢిల్లీ: ‘హలో.. నేను ఐఎస్‌ఐ ఏజెంట్‌ను. ఇకపై ఆ సంస్థలో పనిచేయదలుచుకోలేదు. ఇప్పటినుంచి భారత్‌లోనే నివసించాలను కుంటున్నాను’ అంటూ మాట్లాడి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు అందరిని హడలెత్తించాడు. ముహమ్మద్‌ అహ్మద్‌ షేక్‌ ముహమ్మద్‌ రఫీక్‌ పేరుతో పాకిస్తాన్‌ పాస్‌పోర్టు కలిగిన ఒక వ్యక్తి దుబాయ్‌ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో ఢిల్లీకి వచ్చాడు. ఆ తర్వాత కఠ్మాండుకు టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు.

కానీ ఏమనుకున్నాడో ఏమో కానీ తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. విమానాశ్రయంలోని సహాయ కేంద్రం వద్దకు వచ్చి, అక్కడ పనిచేస్తున్న ఒక మహిళతో తాను పాకిస్తాన్‌ గూఢచర్య  సంస్థలో పనిచేస్తున్నట్లు, ఆ సంస్థకు సంబంధించిన సమాచారం తెలపాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వెంటనే సదరు ఉద్యోగి భద్రతా అధికారులకు సమాచారం తెలిపింది. వారు రఫీక్‌ వివరాలను కేంద్ర నిఘా సంస్థలSకు తెలియజేశారు. అతడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు